ఇరాక్‌లోని యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్‌ దాడి

ఇరాక్‌లోని యూఏఈ కాన్సులేట్‌పై డ్రోన్‌ దాడి

ఇరాక్‌‌లోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాన్సులేట్‌ లక్ష్యంగా డ్రోన్‌ దాడి జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంలో అనవసరంగా తాము చిక్కుకొన్నట్లు యూఏఈ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ కాన్సులేట్‌ స్వల్పంగా దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.