మట్టిపాత్రలు.. ఇలా చేస్తే పదిలం!

మట్టిపాత్రలు.. ఇలా చేస్తే పదిలం!

ప్రస్తుతం మట్టి పాత్రల వినియోగం పెరిగింది. అయితే గ్యాస్ పొయ్యి మీద మంటను హైలో పెట్టి మట్టిపాత్రను పెడితే అది పగులుతుంది. అందుకే చిన్న సెగమీద ఉంచి మంటను పెంచుతూ తగ్గిస్తూ ఉండాలి. దీన్ని వాడే ముందు రోజంతా మట్టి పాత్రను నీళ్లలో నానిబెట్టి తడి ఆరిపోయిన తర్వాత దాని లోపల, బయట వంటనూనె రాసి ఆరనివ్వాలి. వీటిని సబ్బుతో కాకుండా సున్నిపిండి, బూడిద, కుంకుడు రసంతో కడగాలి.