ఫర్టిలైజర్ షాపును సందర్శించిన విద్యార్థులు
SDPT: సిద్దిపేటలోని తెలంగాణ గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రిన్సిపల్ కె.విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం క్షేత్ర పర్యటన చేపట్టారు. ఒకేషనల్ కోర్సులో భాగంగా స్థానిక ఫర్టిలైజర్ షాపును సందర్శించి, వివిధ రకాల ఎరువులు, పురుగుమందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన ద్వారా సాగులో ఉపయోగించే మందుల వినియోగంపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు.