కూరగాయల వ్యాన్‌లో గంజాయి సరఫరా

కూరగాయల వ్యాన్‌లో గంజాయి సరఫరా

VZM: కూరగాయల వ్యాన్‌లో తరలిస్తున్న గంజాయిని నార్కొటిక్ టీమ్ పట్టుకుంది. ముందస్తు సమాచారం మేరకు తెల్లవారుజామున ఒడిశా నుంచి విజయనగరం వైపు గంజాయిని తరలిస్తున్న బొలెరోను నార్కొటిక్ టీమ్ ఛేజ్ చేయగా.. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు చిక్కినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 123 ప్యాకెట్లలో 650 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.