టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

కాకినాడ జిల్లాలో TDPకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి భర్త, టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ పంపారు. ఎమ్మెల్యే నానాజీ తమను పట్టించుకోవడం లేదని, టీడీపీ కార్యకర్తలను పక్కనబెడుతున్నారని ఆయన ఆరోపించారు. కోఆర్డినేటర్లు, పరిశీలకుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.