VIDEO: రోడ్డుపై ఎలుగుబంటి.. భయాందోళనలో కూలీలు
SS: మడకశిర మండలంలోని సిద్ధగిరి, గుండుమల గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పొట్టకూటి కోసం ఆటోలో కూలీ పనులకు వెళ్తున్న సుమారు 10 మంది కార్మికులకు ఈ దృశ్యం ఎదురైంది. రహదారిపై నుంచి ఎలుగుబంటి నెమ్మదిగా పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తుండగా, కూలీలు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు.