'రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలి'

'రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలి'

KNR: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కోసం బీఆర్ఎస్ హయాంలోనే రూ. 540 కోట్లు మంజూరయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ నుంచి రూ. 440 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ చేపడుతున్న సందర్భంగా మానేరు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని ఇన్ఛార్జ్ మంత్రిని కోరారు.