గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

KDP: పోరుమామిళ్లలోని మైదుకూరు రోడ్డులో ఓ సమాధి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. మృతుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. పై ఫొటోలోని వ్యక్తి ఎవరైనా తెలిసి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.