కదిరిలో నేడు స్వాతి నక్షత్ర వేడుకలు
సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం గర్భాలయంలోని మూలవిరాట్టుకు అభిషేకాలు, స్వర్ణకవచ సేవలు ఉంటాయి. భక్తులు స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారికి వెండిరథ ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.