జిల్లాలో యూటీఎఫ్ కోర్ కమిటీ ఎన్నిక..!
ELR: తీగలవంచ నర్సాపురం మండల యూటీఎఫ్ కోర్ కమిటీ ఎన్నిక జరిగింది. నూతనంగా గౌరవ అధ్యక్షులుగా జి. లక్ష్మణరావు, అధ్యక్షులుగా బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా టి.రామాంజి బాబు, కోశాధికారిగా ఎంవివి సుబ్బారావు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తామని, చిత్తశుద్ధితో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.