భూమా అఖిలప్రియ అనుచరుడు ఫిర్యాదు

నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్‌పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన దాడికి సంబంధించి పట్టణ సీఐ రమేష్ బాబు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్ర అనే యువకుడిని తన శత్రువులు ప్రేరేపించి తనను చంపించే ప్రయత్నం చేశారని నిఖిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర అతనిని ప్రేరేపించిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురువారం పేర్కొన్నారు.