పోలీసుల తనిఖీలు.. అక్రమ పశు రవాణా అడ్డగింత
కాకినాడ: కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద శుక్రవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమ పశువుల రవాణా బయటపడింది. విజయనగరం జిల్లా పెద మల్లపురం నుంచి రావులపాలెం సమీపంలోని బొబ్బర్లంక వద్ద పేరవరంకు వెళ్తున్న మూడు వాహనాల్లో 21 పశువులు ఎటువంటి రక్షణ సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాలను అడ్డగించి, పశువులను స్వాధీనం చేసుకున్నారు.