రేపు దేవస్థానంలో హుండీ లెక్కింపు

రేపు దేవస్థానంలో హుండీ లెక్కింపు

అన్నమయ్య: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మార్చి 25న ఉదయం 9 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పురుషులు మాత్రమే పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. పాల్గొనదలచిన వారు సాంప్రదాయ దుస్తులు(పంచ) ధరించి హాజరుకావాలని సూచించారు. ఈ విషయాన్ని ఆలయ ఛైర్మన్ మనోజ్, ఆలయ ఈవో రమణారెడ్డి వెల్లడించారు.