కల్లు గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ
JGL: రాష్ట్రంలోని గౌడ కులస్థుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డులోని ఎల్లమ్మ ఆలయం సమీపంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు 100 శాతం సబ్సిడీతో కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత పాల్గొన్నారు.