జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థి

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థి

GDWL: వీరాపురం TGSWRS కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సిద్ధు రాథోడ్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ​మంగళవారం కాలేజీ ప్రిన్సిపల్ రాజు, టీచర్లు, తోటి విద్యార్థులు సిద్ధు రాథోడ్‌ను కళాశాల వద్ద శాలువా, పూల బొకేతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమ విద్యార్థి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.