ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్న వెంకటేశ్వర్లు

WGL: వరంగల్ హెడ్ క్వార్టర్స్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గీసుగొండకు చెందిన కానిస్టేబుల్ అప్పని వెంకటేశ్వర్లు మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. ఈ పతకాన్ని అందుకున్నందుకు ఆయనకు గ్రామస్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.