ప్రొటోకాల్ వైఫల్యం.. రాష్ట్రపతి అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సీఎం నుంచి గానీ.. మంత్రుల నుంచి గానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. అలాగే సదస్సు వద్దకు ప్రజలకు ప్రవేశాన్ని కూడా నిరోధించిందని మండిపడ్డారు.