భద్రాచలంలో కొండచిలువ కలకలం

TG: భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద కొండచిలువ కలకలం సృష్టించింది. స్నానఘట్టాల వద్ద ఉన్న దుకాణాల్లోని సామాన్లలో కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాని వల్ల ఎవరికైనా ప్రమాదం జరుగుతుందేమోనని దాన్ని చంపివేశారు. గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలో చెత్తాచెదారం, పాములు ఉంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.