ఆన్‌లైన్ లోనే కానుకల చెల్లింపు

ఆన్‌లైన్ లోనే కానుకల చెల్లింపు

ADB: మారుతున్న కాలానికి అనుగుణంగా సంకేతికత పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో వాణిజ్య, వ్యాపార సముదాయాలలో ఆన్‌లైన్ చెల్లింపులతో లావాదేవీలు జరుపుతున్నారు. ఇది ఇలా ఉంటే ఉట్నూర్ మండల కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ ఏరియాలోని సార్వ జనిక్ హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పూజారి స్కానర్ ఏర్పాటు చేశారు. ఈ స్కానర్ సహాయంతో భక్తులు కానుకలను చెల్లిస్తున్నారు.