చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

చెరువులో  వ్యక్తి మృతదేహం లభ్యం

సిద్దిపేట: మద్దూరు(M) గగిళ్లాపూర్ గ్రామంలోని పెద్ద చెరువులో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాలిలా.. ములుగుకి చెందిన తీగుళ్ల నెహ్రూగా(35) గుర్తించినట్లు తెలిపారు. నెహ్రూ ములుగు మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఈ నెల 28 నుంచి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం చెరువులో శవమై తేలాడు.