వాహన పార్కింగ్, టోల్ ప్లాజా ప్రారంభం.

విశాఖ: బొర్రా గుహలుకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద బుధవారం స్థానిక సర్పంచ్ అప్పారావు అధ్యక్షతన ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గంగరాజు, ఎంపీపీ శెట్టి నీలవేణి ఆధ్వర్యంలో వాహన పార్కింగ్, టోల్ ప్లాజాను లాంఛనంగా ప్రారంబించారు. బైక్ లకు రూ.10, ఫోర్ వీలర్ రూ.30, బస్సులకు రూ.50గా ధరలను కేటాయించారు. వచ్చిన ఆదాయంను 60% నిధులతో పంచాయతీ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు.