కళ్యాణదుర్గంలో అక్కమాంబ జాతర ఏర్పాట్లపై సమీక్ష
ATP: కళ్యాణదుర్గంలో వెలిసిన అక్కమాంబ జాతర ఏర్పాట్లను మంగళవారం టీడీపీ నేత దేవినేని ధర్మ తేజ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో అక్కమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించామన్నారు. భక్తులకు తాగునీరు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, డ్రోన్ల ద్వారా భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు.