మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి: CPI డిమాండ్
ASR: మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రంపచోడవరంలో సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఐటీడీఏ వరకు పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని అన్నారు.