చెరువులోకి వ్యర్థాలు?

KDP: బుచ్చినాయుడు కండ్రిగ మండలం భవాని శంకరాపురం పంచాయతీలోని ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు చెరువులో కలుస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. సీసం, పాదరసం వంటి రసాయనాలు నీరు, నేలను కలుషితం చేస్తున్నాయని, దీని వలన చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.