మాలకొండ ఆలయ భూముల సమస్యకు పరిష్కారం
NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతున్నట్లు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. 121 సర్వే నంబర్లోని 433 ఎకరాల భూమి కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిగా నమోదైందని గుర్తించి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.