'భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VKB: భారీ వర్షాల నేపథ్యంలో దుద్యాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై యాదగిరి సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అందులో నిద్రించొద్దని హెచ్చరించారు. రానున్న రెండు, మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.