పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఇంఛార్జ్ ఎంపీడీవో

KMR: ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఇంఛార్జ్ ఎంపీడీవో ప్రకాశ్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు వసతులు ఉన్నాయని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.