మట్టిమిద్దె కూలి బాలికకు తీవ్రగాయాలు

మట్టిమిద్దె కూలి బాలికకు తీవ్రగాయాలు

KRNL: కోడుమూరులో నిన్న మట్టితో నిర్మించిన ఇల్లు కూలిపోవడంతో 14 ఏళ్ల మానస అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు బయట ఉండగా, శబ్దం విని లోపలికి వచ్చి చూసేసరికి శిథిలాల కింద బాలిక చిక్కుకుంది. స్థానికుల సహాయంతో ఆమెను బయటకు తీసి కోడుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.