జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై CM ఆరా
BPT: బాపట్ల జిల్లా సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి పార్థసారథి, మంత్రి సత్యప్రసాద్, ఎంపీ కృష్ణ ప్రసాద్‌లతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్షించారు.