గ్రామాల వారిగా మహిళల రిజర్వేషన్ ఖరారు
KMR: బీర్కూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం గ్రామాల వారిగా మహిళా రిజర్వేషన్లను ప్రకటించారు. మొత్తం 13 గ్రామ పంచాయతీలకు ఎస్సీ 2, ఎస్టీ 1, బీసీ 3, జనరల్ 7 స్థానాలను కేటాయించారు. దీంతో సర్పంచుల పదవిపై ఆశావహుల ఆసక్తి పెరిగింది.