మంత్రి లోకేష్‌తో టీడీపీ మండల అధ్యక్షుడు భేటీ

మంత్రి లోకేష్‌తో టీడీపీ మండల అధ్యక్షుడు భేటీ

AKP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌తో కోటవురట్ల మండలం టీడీపీ అధ్యక్షుడు పెట్ల లింగన్నాయుడు మంగళవారం భేటీ అయ్యారు. కోటవురట్లలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. అలాగే మండలం అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు లింగన్నాయుడు తెలిపారు.