VIDEO: మంత్రి పీఏ వేధింపులపై చర్యలేవీ?
VSP: కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవి, జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ పార్టీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తున్నా ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు.