బీరప్ప- కామరతి కళ్యాణంలో పాల్గొన్న కేటీఆర్

SRCL: సిరిసిల్లలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తంగ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప- కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.