ఆరోగ్య అంశాలపై అవగాహన

W.G: ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులను అశ్రద్ధ చేయవద్దని వైద్యుల సహాయం పొందాలని కాళ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.సునీల్ పేర్కొన్నారు. కాళ్ల మండలం జక్కరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆరోగ్య అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు.