'మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ వాస్తవం'
AP: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములలో 32.63 ఎకరాల ఆక్రమణ వాస్తవం అని PCCF కార్యాలయం తెలిపింది. ఏపీ అటవీ చట్టం సెక్షన్ల ప్రకారం A1గా మిథున్ రెడ్డి, A2గా రామచంద్రా రెడ్డి, A3గా ద్వారకానాథ్ రెడ్డి, A4గా ఇందిరమ్మలపై కేసు నమోదైంది. ఈ భూమిని స్వాధీనం చేసుకొని, POR ఆధారంగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేశామని PCCF కార్యాలయం తెలిపింది.