ఇకపై వాట్సాప్‌కే ఎఫ్ఐఆర్

ఇకపై వాట్సాప్‌కే ఎఫ్ఐఆర్

HYD: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాట్సాప్‌కే FIR పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. బాధితుడు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుడికి పోలీసు సేవలపై నమ్మకం, విశ్వాసం పెరగడంతో పాటు పోలీసు సేవలు పారదర్శకంగా ఉంటాయన్నారు.