VIDEO: మురికికూపాలుగా మారుతున్న ఖాళీ స్థలాలు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో అనేక చోట్ల ఖాళీ స్థలాలు మురికికూపాలుగా మారుతున్నాయి. 9వ వార్డు శాంతినగర్‌లో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఖాళీ స్థలంలో నీరు చేరి వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమల తాకిడి విపరీతంగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. స్థానికులు జ్వరాల బారిన పడుతున్నమని తెలిపారు.