టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

టీడీపీ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

SS: నల్లమాడ మండలం వెళ్ళమద్దికి చెందిన టీడీపీ నాయకుడు రమణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేడు రమణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.