VIDEO: దుర్గమ్మ గుడి సమీపంలో మృతదేహం కలకలం

VIDEO: దుర్గమ్మ గుడి సమీపంలో మృతదేహం కలకలం

ఎన్టీఆర్: విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలో మ‌ృతదేహం కలకలం రేపింది. దుర్గానగర్ టాయిలెట్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఇవాళ లభ్యమైంది. సమీపంలో దుర్గంధం రావడంతో శానిటేషన్ సిబ్బంది డెడ్ బాడీని చూసి షాక్‌కు గురయ్యారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో.. మూడు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.