BREAKING: పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్
AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వీరు జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.