'సైబర్ నేరాలపై యువతకు అవగాహన అవసరం'
PDPL: యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీ రామ్ రెడ్డి సూచించారు. మంగళవారం పాలకుర్తి మండలం బాంమ్లా నాయక్ తండాలో గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల మార్గంలో నడవాలని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రత్యేకత సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, సర్పంచ్ అఖిల పాల్గొన్నారు.