'ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి'

'ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి'

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడారు. జయ నాగేశ్వర రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీకి వారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేస్తోందన్నారు.