త్వరలో ఆలయ షెడ్డు నిర్మాణం
ADB: తలమడుగు మండలంలోని సుంకిడి అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్‌ను కలిశారు. ఆలయంలో షెడ్ నిర్మాణం చేపట్టాలని కోరగా త్వరలో షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయానికి తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.