బాల్య వివాహాల నిర్మూలనపై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్

GDWL: బాల్యవివాహాలు, వేధింపుల నిర్మూలనపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఐడీఓసీ మందిరంలో మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, తదితర చట్టాల గురించి వివరించారు.