క్రికెట్: సంగారెడ్డి-ఏ జట్టు విజయం
SRD: బీపీఆర్ సింగపూర్ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్ జిల్లాల క్రికెట్ అండర్-14 పోటీలు నిర్వహించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిద్దిపేట పింక్ జట్టు 89 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సంగారెడ్డి-ఏ జట్టు 90 పరుగులు చేసి విజయం సాధించిందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ తెలిపారు.