VIDEO: అమ్మవారి ఆలయంలో విధ్వంసం
MDCL: దుండిగల్ PS పరిధి బహదూర్ పల్లిలోని కాకతీయుకాలం నాటి నల్లపోచమ్మ ఆలయంలో అర్ధరాత్రి దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. గుడి తాళాలు పగలగొట్టిన దొంగలు అమ్మవారిచీరలు, హుండీలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. విగ్రహంపై ఉన్న ఆభరణాలు రోల్డ్ గోల్డ్ అని గుర్తించిన దొంగలు.. వాటిని ఆలయ ఆవరణలో చెల్లాచెదురుగా పడేసినట్లు భక్తులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.