పద్మావతి దేవి కుంకుమ, కంకణాల పంపిణీ

పద్మావతి దేవి కుంకుమ, కంకణాల పంపిణీ

CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కుంకుమను భక్తులకు అందజేశారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా టీటీడీ వారు సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అమ్మవారి కుంకుమ, గాజులు, పసుపు దారం, కంకణాలను ముత్తయిదులకు అందజేశారు.