బస్సు ఆపలేదని మహిళ హల్‌చల్( వీడియో)
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ హల్‌చల్ చేసిన ఘటన జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. బస్సు ఆపనందుకు సదరు మహిళ డ్రైవర్‌పై బూతులతో విరుచుకుపడింది. దీంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపి మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య సుమారు గంటసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల రావడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం బస్సు డ్రైవర్ మహిళపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.