పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలి

VZM: పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. శనివారం గంట్యాడ మండలంలోని మదనాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఆదర్శవంత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు పాల్గొన్నారు.