డస్ట్, కంకరతో రాకపోకలకు ఇబ్బందులు
VKB: బంట్వారం మండల కేంద్రంలోని బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై డస్ట్, కంకర పోయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డు పనులు వారం రోజులుగా నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను వారు కోరుతున్నారు.